సగం ఖాళీ! | - | Sakshi
Sakshi News home page

సగం ఖాళీ!

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

జీజీహెచ్‌ పోస్టులు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు,

ఉన్నతాధికారులు

అవస్థలు పడుతున్న రోగులు

జనరల్‌ ఆస్పత్రిలో తప్పని ఇక్కట్లు

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఖాళీలు వేధిస్తున్నాయి. కొన్నేళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడంతో రోగులకు ఇ బ్బందులు తప్పడం లేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లా ల్లో రెండు విడతల్లో ఖాళీలను భర్తీ చేయగా.. జిల్లా లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నర్సింగ్‌, పారా మెడికల్‌, క్లాస్‌ –4 పరిధిలో మొత్తం 573 పోస్టులకు గాను 252 పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. అటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఖాళీల భర్తీపై దృష్టి సారించడం లేదు.

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో 700 పడకలు ఉండగా.. ప్రతిరోజూ 2 వేల మంది వరకు అవుట్‌ పేషెంట్‌లు వస్తున్నారు. అలాగే 250 మంది వరకు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. ముఖ్యమైన విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. మెడికల్‌ కళాశాల మంజూరైన 2009లో 150 జీవో ప్రకారం జిల్లాకు 750 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. ఫ్యాకల్టీ విభాగంలో 35 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 11 ఖాళీ ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ విభాగంలో 57 పోస్టులకు గాను ఏకంగా 48, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విభాగంలో 109 పోస్టులకు గాను 14 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ట్యూటర్స్‌ విభాగంలో 23 పోస్టులకు గాను రెగ్యులర్‌గా ఒక్క రు, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 225 పోస్టులకుగాను 92 ఖా ళీలు ఉన్నాయి. సీనియర్‌ రెసిడెంట్‌ విభాగంలో103 పోస్టులకు గాను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 14, రెగ్యులర్‌గా 36 మంది పని చేస్తున్నారు. జూనియర్‌ రెసిడెంట్‌ 18 పోస్టులకు గాను 18 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 121 పోస్టులకు గాను 65 ఖాళీలు ఉన్నాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ విభాగంలో ఏడు పోస్టులకు గాను ఒకరు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తుండగా.. మిగతా 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆస్పత్రిలోని ముఖ్యమైన మినిస్టీరియల్‌ స్టాఫ్‌ విభాగంలో 84 పోస్టులకు గాను 40 మంది మా త్రమే పని చేస్తున్నారు. ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌ టైపిస్ట్‌ విభాగంలో 8 పోస్టులకు గాను ఇద్దరు పని చేస్తుండగా 6 ఖాళీ ఉన్నాయి. అసిస్టెంట్‌ విభాగంలో 8 పోస్టులకు గాను ముగ్గురు పనిచేస్తుండగా ఐదు ఖాళీ ఉన్నాయి. స్టెనో విభాగంలో 11 పోస్టులకు 11 ఖాళీ ఉన్నాయి. సీనియర్‌ అసిస్టెంట్‌ విభాగంలో 6 పోస్టులకు గాను రెండు ఖాళీ ఉన్నాయి.

ప్రభుత్వాలు మారుతున్నా..

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పూర్తిస్థాయి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను జిల్లాకు మంజూరు చేశారు. అనంతరం పోస్టుల భర్తీ చేపట్టేందుకు జీవో కూడా మంజూరైంది. నాటి నుంచి ఆస్పత్రిలో పోస్టుల భర్తీకి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రభుత్వాలు మారుతున్నా పట్టించుకున్న వారు లేరు. ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయనే విమర్శలున్నాయి.

నర్సింగ్‌ విభాగం..

సమస్య లేకుండా చూస్తున్నాం

జీజీహెచ్‌లో పోస్టులు ఖాళీగా ఉన్నా యి. అయినప్పటికీ రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఖాళీలు భర్తీ చేస్తే ఎంతో మేలు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రోగులకు మాత్రం మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్‌ రాములు,

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

నర్సింగ్‌ విభాగంలో ఖాళీల కొరత తీవ్రంగా ఉంది. 265 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు గాను 239 మంది పని చేస్తున్నారు. 26 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏఎన్‌ఎం పోస్టులు ఏడు ఉండగా.. ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 281 పోస్టులకు గాను 249 మంది పనిచేస్తుండగా 32 ఖాళీ ఉన్నాయి. అలాగే నాల్గోతరగతి విభాగంలో మొత్తం 93 పోస్టులకు గాను ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement