మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

మెరుగైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Sep 24 2026 2:30 AM | Updated on Sep 24 2026 2:30 AM

రుద్రూర్‌: విద్యుత్‌ సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ రాజేశ్వర్‌రావు అన్నారు. మండలంలోని అంబం (ఆర్‌) విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు గ్రామశివారులో ఏర్పాటు చేసిన 3 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ గ్రిడ్‌కు అనుసంధానించి బుధవారం టెక్నికల్‌ చార్జింగ్‌ చేశారు. ఈ ప్లాంట్‌ అందుబాటులోకి రావడంతో స్థానికంగా విద్యుత్‌ సరఫరా మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. రాయకూర్‌, అంబం(ఆర్‌) సబ్‌స్టేషన్‌లకు ఐదు మెగావాట్ల సౌర విద్యుత్‌ అందుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈ వెంకటరమణ, మహమ్మద్‌ ముక్తార్‌, ఏడీఈ నవీన్‌ రెడ్డి, ఏఈ శ్రీనివాస్‌, సబ్‌ ఇంజనీర్లు నవీన్‌కుమార్‌, గిరిధర్‌, ఎస్‌ఎల్‌ఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement