వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మి కాలువకు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 250 క్యూసెక్కుల నీటిని ఎస్సారెస్సీ ఇన్‌చార్జి ఈఈ పవన్‌కుమార్, డీఈఈ లోక్యానాయక్ మంగళవారం విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టు రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు నుంచి కాలువకు నీటిని విడుదల చేపట్టారు. ఏఈఈ వినోద్ ఆధ్వర్యంలో లస్కర్లు నీటి విడుదలను పర్యవేక్షించారు. కాలువలో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఆయకట్టు ౖప్రాంతాలకు నీరు సక్రమంగా చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. నీటి లభ్యతతో పంటల సాగుకు భరోసా ఏర్పడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


