నిధులు సరిపోలేవు
గంగరమంద వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరిపోలేదు. నిధులు ఉన్న మేరకు పనులు జరిగాయి. వంతెనకు ఇరువైపులా సీసీ చేయటానికి కొత్తగా ప్రతిపాదనలు పెట్టాలి. చిన్నాపూర్ వంతెన ఆర్‌అండ్‌బీ అధికారుల ఆధ్వర్యంలో చేట్టారు. దాంతో నాకు సంబంధం లేదు. – సాయి సూర్య,
పంచాయతీరాజ్ ఏఈ, మాక్లూర్
ఇరువైపులా సీసీ వేయాలి
గంగరమంద వంతెన పూర్తయి సుమారు 2 సంవత్సరాలు కావస్తోంది. ఇంతవరకు వంతెనకు ఇరువైపులా సీసీ వేయలేదు. ఫలితంగా వంతెనకు ఇరువైపులా మట్టిరోడ్డుకు గుంతలు పడి చిందరవందర కావటంతో పది గ్రామాల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సీసీ వేయించాలి.
– కరిపే రాజు, గంగరమంద, మాక్లూర్


