ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్‌లు సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.7.5 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్ మాట్లాడుతూ.. నిధులు మంజూరుకు కృషి చేసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు.
బీజేపీ నేతల ఆధ్వర్యంలో..
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడిరాకేష్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ.. నూతన మున్సిపల్ భవనానికి రూ. ఏడున్నర కోట్లు నిధులు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డికే చెందుతుందన్నారు. అసెంబ్లీ సాక్షిగా నిధుల కోసం పోరాడి తీసుకొచ్చారన్నారు. అలాగే రోడ్ల మరమ్మతులకు సైతం నిధులు తెచ్చారన్నారు. బీజేపీ నాయకులు, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.


