● బోధన్ ఏసీపీ శ్రీనివాస్
బోధన్: రాబోయే గణేశ్ నవరాత్రి ఉత్సవాలను అ త్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు భ ద్రతా ప్రమాణాలు పాటించాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. శనివారం సాలూర మండ ల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వ హించిన మండల స్థాయి గణేశ్ మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథి గా విచ్చేసి ఏసీపీ మాట్లాడారు. గణేశ్ మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన శోభాయాత్రల్లో డీజీలకు అనుమతి లేదన్నారు. ఉత్సవాల్లో ఆధ్యాత్మిక సంబంధ సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నందున నాణ్యమైన వైర్లు ఎంసీబీలతో బిగించుకుంటే ప్రమాదాలు జరుగకుండా ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ కల్యాణ్ సూచించారు. బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై రాజశేఖర్, తహసీల్దార్ అజ్మత్ నవాజ్, తదితరులు పాల్గొన్నారు.


