● సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి
ఆర్మూర్ టౌన్: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే ప్రతిష్ఠించి పూజలు చేయాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్‌లో చౌల్ సాయిప్రభాస్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్జి శ్రీదేవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతులను ప్రతిష్టించడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందని, అందుకే మట్టి గణపతులనే పూజించాలని సూచించారు. అలాగే న్యాయ సేవా సంస్థ అందిస్తున్న సేవలు, చట్టాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం జడ్జి శ్రీదేవి, ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ ఎస్సై రఘుపతి, క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు గటాడి ఆనంద్ చేతుల మీదుగా ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు.


