కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పులలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన నూతన స్మార్ట్ రేషన్‌కార్డులను స్థానిక సర్పంచ్ సేపూర్ చరణ్‌గౌడ్ శనివారం పంపిణీ చేశారు. నాయకులు శ్రీనివాస్, భోజాగౌడ్, మహేష్, శేఖర్, స్వామి, నాయక్, భూమేష్, సుదర్శన్‌గౌడ్, బొర్రన్న, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
రుద్రూర్: అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రుద్రూర్, రాణంపల్లి సర్పంచ్‌లు ఇందూరు సునీత చంద్రశేఖర్, కొండల్‌వాడీ శంకర్ అన్నారు. శనివారం గ్రామ పంచాయతీల వద్ద నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు సర్పంచ్‌లు అందజేశారు. రాయకూర్ విండో వైస్ చైర్మన్ తోట అరుణ్, ఉపసర్పంచ్‌లు షేక్ నిస్సార్, షాదుల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


