● సీపీ సాయి చైతన్య
కమ్మర్‌పల్లి/ బోధన్ టౌన్: జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దాడులు చేపట్టాలని సీపీ సాయిచైతన్య పోలీసు అధికారులను ఆదేశించా రు. ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై శుక్రవారం ఆయన భీంగల్, బోధన్‌లో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితు లకు వెంటనే సహాయం అందించాలని సూచించా రు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, బెయిల్‌పై విడుదలైన వారిపై పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువ గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లా క్ స్పాట్లను గుర్తించి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయా లన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీసీఆర్ బీ ఏసీపీ గురునాయుడు, ఇన్‌స్పెక్టర్ ఆర్ అంజయ్య, భీమ్‌గల్ సీఐ పొన్నం సత్యనారాయణగౌడ్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


