నిజామాబాద్ అర్బన్: బస్టాండ్ ప్రాంతంలో స్పృహ తప్పి కిందపడిపోయిన ఓ హిజ్రా(40) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 8న స్పృహ తప్పి కిందపడిపోయిన హిజ్రాను స్థానికులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుడిచేతిపై అమ్మ అని పచ్చబొట్టు ఉందన్నారు. వివరాలు తెలిసిన వారు 8712659714 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
నిజామాబాద్ అర్బన్: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రెండో టౌన్ పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శివాజీనగర్‌కు చెందిన శివానీ అనే మహిళ ఇటీవల రెండో టౌన్ పీఎస్‌లో ఓ కేసు విషయమై వచ్చింది. కేసు విషయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వీడియో చిత్రీకరించింది. దీంతో ఆమైపె కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.


