● ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
ఆర్మూర్: జిల్లాకు అభివృద్ధి నిధులు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం పక్షపాత ధోర ణిని ప్రదర్శిస్తోందని ఆర్మూర్ ఎమ్మె ల్యే రాకేశ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో నూతన కంపెనీలు పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రభు త్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జక్రాన్‌పల్లి ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేసి 20 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సహకారం అందించడం లేదని ఆరోపించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రికి జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టు కోసం ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.


