పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Sep 12 2026 1:36 AM | Updated on Sep 12 2026 1:36 AM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత చిట్టి చేతులతో.. మట్టి గణపతులు అటవీ అమరుల త్యాగాలు గొప్పవి

డీఈవో అశోక్‌ కుమార్‌

మాక్లూర్‌:పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్య త అని డీఈవో అశోక్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని అమ్రాద్‌ ప్రభుత్వ పాఠశాలలో హె చ్‌ఎం సురేశ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమానికి డీఈవో హాజరై మాట్లాడారు. కెమికల్‌తో కూడిన గణేశ్‌ విగ్రహాల వల్ల పర్యావర ణం దెబ్బతింటుందని, మట్టి గణపతులను పూజించాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల క్రాఫ్ట్‌ టీచర్‌ తర్ల రమేశ్‌, పీఆర్టీయూ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు పవన్‌, రమేశ్‌, సాయన్న, నీరజ, విద్యార్థులు పాల్గొన్నారు.

డొంకేశ్వర్‌: వినాయక చవితి పండుగను పుర స్కరించుకుని డొంకేశ్వర్‌ మండలం మారంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై తమకున్న బాధ్యతను చాటుకున్నారు. పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో కలిసి తమ చిట్టి చేతులతో, భక్తిశ్రద్ధలతో, నైపుణ్యంతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యా యులు విద్యార్థులను అభినందించారు.

డీఎఫ్‌వో ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌

డొంకేశ్వర్‌: అడవులు, పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగం చేసిన ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌వో) ప్రశాంత్‌ బాజీరావు పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అమరుల స్థూపం వద్ద చిత్రపటానికి డీఎఫ్‌వో పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అంతకు ముందు అటవీ శాఖ సిబ్బంది నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్‌ ఎఫ్‌డీవో సుధాకర్‌, నార్త్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సంజయ్‌గౌడ్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement