● డీఆర్డీవో సాయన్న
● మండల సమాఖ్య అధ్యక్షురాలికి సన్మానం
డిచ్‌పల్లి: సీ్త్రనిధి కార్యక్రమాల అమలులో డిచ్‌పల్లి మండల సమాఖ్య విశేష ప్రతిభ కనబరుస్తూ ‘మన సీ్త్రనిధి’ యాప్ ద్వారా ఆన్‌లైన్ రుణ చెల్లింపుల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా జిల్లా సమాఖ్యలో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్డీవో సాయన్న చేతుల మీదుగా డిచ్‌పల్లి మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆరేపల్లి స్వప్నను ఘనంగా సన్మానించారు. డీఆర్డీవో మాట్లాడుతూ.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.36 కోట్ల రుణ పంపిణీ లక్ష్యానికి గాను రూ. 9.46 కోట్ల రుణాలను అందించి 105 శాతం లక్ష్యాన్ని సాధించడం ద్వారా డిచ్‌పల్లి మండల సీ్త్రనిధి సమాఖ్య మరో విశిష్ట విజయాన్ని నమోదు చేసిందన్నారు. మండలంలో 3 ఎలక్ట్రికల్ ఆటోలు, 10 ఎలక్ట్రికల్ స్కూటీలను సీ్త్రనిధి రుణాల ద్వారా మహిళా సభ్యులకు అందించడం హర్షనీయమన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. సమాఖ్య కార్యవర్గ సభ్యులు, వీవోఏలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, సీ్త్రనిధి సిబ్బంది సమష్టి కృషి, సహకారంతోనే ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. మండలాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన సీ్త్రనిధి అసిస్టెంట్ మేనేజర్ రాఘవ, ఏపీఎం రవీందర్‌రెడ్డి, సీసీలు, వీవోఏలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో మధుసూదన్, డీపీఎంలు సంధ్య, నీలిమ, ఆర్‌ఎం రాందాస్, అసిస్టెంట్ మేనేజర్ రాఘవ, ఏపీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


