కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు

Sep 12 2026 1:36 AM | Updated on Sep 12 2026 1:36 AM

కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీగా సాగర్‌ జడ్జి హరీష బదిలీ

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతు న్న ఎంఈడీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 1, 2, 3, 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. పరీక్షలకు 28 మందికి 28 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి):ఎన్‌ఎస్‌యూ ఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీగా బానోత్‌ సాగర్‌ నాయక్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం అడ్వకేట్‌గా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న బానోత్‌ సాగర్‌ నాయక్‌, గతంలో తెయూ అధ్యక్షుడిగా పనిచేశారు. తెయూ విద్యార్థుల సమస్యలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఆయన చురుకుగా పనిచేశారు. విద్యార్థి నాయకుడిగా, నాయకత్వ అనుభవాన్ని గుర్తించిన ఎన్‌ఎస్‌యూఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఆయనకు రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించింది. బానోతు సాగర్‌ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీగా అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు వినోద్‌ జకార్‌, రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ స్వామి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

● హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు జడ్జీగా నియామకం

నిజామాబాద్‌ లీగల్‌: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సెషన్స్‌ జడ్జీల బదిలీల్లో భాగంగా నిజామాబాద్‌ మొదటి అడిషనల్‌ డిస్ట్రిక్‌ సెషన్స్‌ జడ్జి హరీష బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్మెంట్‌, ఏసీబీ కేసుల విచారణ విభాగంలో ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జీగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆదేశాల జారీ చేశారు. హారిష ఏడాదిన్నరగా నిజామాబాద్‌ మొదటి అడిషనల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జీగా, ఫ్యామిలీ కోర్టు జడ్జీగా విధులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement