● కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిజామాబాద్ రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు సరైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ అధికారి సౌందర్య, జిల్లా వైద్యాధికారి రాజశ్రీలతో కలిసి కలెక్టర్ పోషక మాస పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలలో పౌష్టికాహార లోపం రక్తహీనతను నివారించే విధంగా ఆహారాన్ని అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఇళ్ల వద్ద తాజా కూరగాయలు, ఆకుకూరలు పెంచడానికి కిచెన్ గార్డెన్ల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. పోషణ మాసం ఈ నెల 9 నుంచి అక్టోబర్ 8 వరకు మన అంగన్‌వాడీ మన బాధ్యత పేరిట కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి అశోక్, అర్బన్ ిసీడీపీవో విజయలక్ష్మి, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్తలు రాంబాబు, ప్రసాద్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ప్రణతి పాల్గొన్నారు.


