మోడల్‌ కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయాలి

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

ఇద్దరు బాలురపై పోక్సో కేసు

ఆర్మూర్‌: ఆధునిక వ్యవసాయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో మోడల్‌ కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యాలు కల్పించాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా క్వశ్చన్‌ హవర్‌లో గురువారం ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి హార్టికల్చర్‌ అంశంపై మాట్లాడారు. అంకాపూర్‌ అంటే దేశంలోని ఆదర్శ గ్రామమని ప్రత్యేక గ్రాంట్‌ ద్వారా ఏడాదికి రూ.5 లక్షలు వస్తాయని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పందిస్తూ మోడల్‌ కూరగాయల మార్కెట్‌ గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి

మధు యాష్కీగౌడ్‌ను

కలిసిన రూరల్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌ రూరల్‌: ఆలిండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌గా ఎంపికై న మధు యా ష్కీగౌడ్‌ను నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూ పతిరెడ్డి హైదరాబాద్‌లో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

లింగంపేట: మండలానికి చెందిన ఇద్ద రు బాలురపై గురువారం పోక్సో కేసు నమోదు చే సినట్లు ఎస్సై దీపక్‌కుమార్‌ తెలిపారు. పదో తరగతి విద్యార్థినికి వీరు మాయమాటలు చెప్పి మోసం చేశారని, సదరు బాలిక గర్భవతి అయిన ట్లు గుర్తించి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, ఇద్దరు బాలురపై కేసు పెట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement