నిజామాబాద్ రూరల్: వార్షిక రుణ ప్రణాళిక 2026–27 సంవత్సరానికి చెందిన రుణ ప్రణాళికను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో లీడ్ బ్యాంక్ మేనేజర్ కే రాజు ఆధ్వర్యంలో బ్యాంకుల మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 19,943 కోట్ల రుణ ప్రణాళిక రివకరీ చేయవల్సి ఉండగా 30.6.2026 వరకు రూ. 6137 కోట్లు రెన్యువల్స్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా 17.39 శాతం రికవరీ చేయడం జరిగిందన్నారు. వివిధ రుణాలు, రైతులకు సంబంధించి రుణాలు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రుణాలు సకాలంలో చెల్లించిన వారికి తిరిగి మళ్లీ రుణాలు ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, బ్యాంకు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.


