● రోడ్డు ప్రమాదాలను నివారించాలి
● కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర
నిజాంసాగర్: నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. గురువారం సాయంత్రం నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ భవనాన్ని, స్ట్రాంగ్ రూం గదులను పరిశీలించారు. స్టేషన్‌లో రిజిష్టర్ల నిర్వహణ, రోల్ కాల్, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులపై బాధ్యతాయుతంగా వ్యవహరించి సత్వర న్యాయం అందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, ఎస్సై శివకుమార్, ఏఎస్సై నర్సయ్య తదితరులు ఉన్నారు.


