ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

వేల్పూర్‌: ఎస్సారెస్పీలో 46 టీఎంసీల నీరున్నందున తక్షణమే 6 టీఎంసీల నీటిని విడుదల చేసి ప్రాజెక్టు కింద రెండు లక్షల ఆయకట్టును కాపాడాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గుత్ప, అలీసాగర్‌, లక్ష్మి, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, బోదెపల్లి, వేంపల్లి, నవాబు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించాలని, వ్యవసాయానికి 24 గంటల కరెంటును సరఫరా చేయాలన్నారు. రైతులు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకుండా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం దారుణమని అన్నారు.

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement