గంజాయి పట్టివేత
నిజామాబాద్ అర్బన్: నగరంలోని 6వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయిని గురువారం పట్టుకున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. తమ సిబ్బందితో జన్నేపల్లి రైల్వే గేటు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక షిప్ట్‌కారును తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పట్టుకొని విచారించగా రాజేందర్, సదామ్ నాందేడ్‌కు చెందిన వీరు శంషాబాద్‌నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి నిజామాబాద్‌లో అమ్మడానికి రాగా పట్టుకున్నట్లు తెలిపారు. నాలుగు కేజీల గంజాయి, కారు, రెండు సెల్‌ఫోన్లు సీజ్ చేసి అరెస్టు చేయగా రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.


