డిచ్‌పల్లి: జీపీలకు వచ్చే నిధులను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 (నాలుగో సవరణ) బిల్లు 2026కు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శాసనసభలో మద్దతు తెలిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరతతో పాటు నిధుల వినియోగంలో జాప్యాన్ని తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కొత్త సవరణతో జీపీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి


