రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపిక

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపిక రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలికి సన్మానం

సిరికొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు సిరికొండ సత్యశోధక్‌ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ ఆర్‌ నర్సయ్య గురువారం తెలిపారు. ఆర్మూర్‌లో ఈ నెల 6న నిర్వహించిన జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్‌ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబర్చిన బీ హర్షిత్‌, కే అజయ్‌, జీ సాయితేజ, డీ శ్రీకాంత్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తిలక్‌ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ అండర్‌–15 పోటీల్లో వీరు పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. విద్యార్థులను పాఠశాలలో అభినందించారు. పీఈటీలు అనిల్‌, అనికేత్‌, మౌనిక, విద్యార్థులు పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు గ్రహీత తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్‌ కరిమిండ్ల లావణ్యను గురువారం పార్ట్‌టైమ్‌ అధ్యాపకుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు ప్రసన్న, ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ తాహెర్‌, గంగాధర్‌, రఘువీర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, అశోక్‌ చవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐక్యంగా హక్కులను సాధించుకుందాం

జక్రాన్‌పల్లి: జిల్లాలోని సర్పంచులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్న సాయిరెడ్డి అన్నారు. గురువారం అర్గుల్‌ పీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లోని సర్పంచులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్పంచుల ప్రధా న సమస్య ఉప సర్పంచులకు చెక్‌ పవర్‌ ఉండడంతో అభివృద్ధిలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అన్నారు. చెక్‌ పవర్‌ రద్దు కోసం రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామన్నారు. హక్కుల సాధనలో ఎ లాంటి ఒత్తిళ్లకు లొంగేది లేదన్నారు. సర్పంచు ల న్యాయమైన డిమాండ్‌ల సాధనకు అందరూ ఐక్యంగా కలిసి ముందుకు వెళదామని అన్నా రు. అనంతరం పలు అంశా లపై తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో మోహన్‌ రెడ్డి, అంకాపూర్‌ దేవేందర్‌ రెడ్డి, సంతోష్‌, జనార్దన్‌, గొట్టిపాటి వాసు, మోహన్‌, రాజుగౌడ్‌, జలంధర్‌ రెడ్డి, ఉమారాణి సంజీవ్‌, గడ్డం అనిల్‌, రాజు, శ్రీనివాస్‌, సుదర్శన్‌, కొ మ్ముల శ్రీనివాస్‌, భూమేశ్వర్‌, సాయిరెడ్డి, చందర్‌, నీలిమ సాయిరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement