● ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్
● పాదచారులకు ఇబ్బందులు
నగరంలోని రోడ్లపై పాదచారుల నడక కష్టంగా మారుతోంది. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు ఉన్నా అవి ఆక్రమణలకు గురికావడంతో నడిచేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో పాదచారులు రోడ్డు పైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది.
బస్టాండ్ పరిసరాల్లో ఆటోస్టాతండ్ కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించినప్పటికీ కొందరు డ్రైవర్లు నడిరోడ్డుపైనే ఆటోలను నిలుపుతున్నారు. దీంతో రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. నగరంలోని రద్దీ ప్రాంతాలైన ఖలీల్‌వాడి, బస్టాండ్, గాంధీచౌక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఫుట్‌పాత్‌లను వ్యాపారులు ఆక్రమించడంతో రోడ్లపై నడిచేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించి, రోడ్లపై వాహనాలను నిలుపకుండా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ – నిజామాబాద్


