పెర్కిట్: ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ పీహెచ్‌సీలో ఫార్మసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా మంగళవారం పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ లక్ష్మణ్‌కు పీహెచ్‌డీ పట్టాను అందజేశారు. ప్రొఫెసర్లు శ్రీకృష్ణ, నాయుడు అశోక్, లింబాద్రి పర్యవేక్షణలో ‘సైకాలాజికల్ క్యాపిటల్ అకడమిక్ ఎంగేజ్‌మెంట్, అచీవ్‌మెంట్ మోటివేషన్ లత కొర్రెలేట్స్ ఆఫ్ సైకాలాజికల్ వెల్ బీయింగ్ ఇన్ హైస్కూల్ స్టూడెంట్స్’ అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు. గోవింద్‌పేట్ పీహెచ్‌సీలో వైద్యాధికారిణి మానస లక్ష్మణ్‌ను బుధవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో శంకర్, సిబ్బంది నళిని దేవి, సంధ్య, మాజీద్ పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: ముదక్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఖానాపూర్ బస్తీ దవాఖానాను డీఎంహెచ్‌వో రాజశ్రీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, రికార్డులు, ఓపెన్ రిజిస్టరు, ఔషధాల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు.


