● కలెక్టర్ భవేశ్ మిశ్రా,
సీపీ సాయి చైతన్య
ఖలీల్‌వాడి: పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్య ర్థులు ఉద్యోగ సాధనే ధేయ్యంగా ప్రయత్నించాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాల ని కలెక్టర్ భవేశ్ మిశ్రా, సీపీ సాయి చైతన్య అన్నా రు. జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీ ఆడిటోరియంలో ఫ్రీ రిక్రూట్మెంట్ ప్రోగ్రాంను కలెక్టర్, సీపీ బుధవారం ప్రారంభించారు. పోటీ పరీక్షల మెలుకవలు తెలిస్తే పోలీసు శాఖలో ఉద్యోగం ఈజీగా సా ధించవచ్చని వారు అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులలో సుమారు 200 మందిని ఎంపిక చేశారు. జిల్లా యంత్రాంగం తోడ్పాటుతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్‌ను ఏర్పాటు చేశారు. అనవసర భయాలను వీడి ఆత్మవిశ్వాసా న్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో జీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి, భాగ్యకిరణ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ భాగ్య కిరణ్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ యాదవ్ పాల్గొన్నారు.


