● డీవైఎస్‌వో పవన్‌కుమార్
వేల్పూర్: రాష్ట్రంలో క్రీడలకు సీఎం రేవంత్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జిల్లా యువజన సంక్షేమ క్రీడల అభివృద్ధి అధికారి పవన్‌కుమార్ అన్నారు. మండలంలోని పడగల్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమైన 70వ ఎస్‌జీఎఫ్ మండల అంతర్ పాఠశాల క్రీడల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలపై ఉన్న ఆసక్తితో రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యువకులు సెల్‌ఫోన్లకు బానిసలు కాకుండా ఆటలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు చదువుల్లో, ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు ఉంటాయన్నారు. క్రీడల కన్వీనర్ పీ జలంధర్, వేల్పూర్ ఎంపీడీవో రఘురాం, సర్పంచ్ నల్లరాజు, ఎంఈవో రేణుక జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. మార్చ్‌పాస్ట్ పోటీలు నిర్వహించగా పడగల్ హైస్కూలుకు ప్రథమ, వేల్పూర్, పచ్చలనడ్కుడ స్కూళ్లకు ద్వితీయ, అంక్సాపూర్‌కు తృతీయ, మిగతా పాఠశాలలు కన్సోలేషన్ బహుమతులు పొందాయి. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గైని నరేందర్, వీడీసీ సభ్యులు రాజారావు, ఎర్రం గంగాధర్, నర్సారెడ్డి, వినోద్, బింగి శ్రీకాంత్, వార్డు సభ్యులు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం సరోజిని, ఎస్‌ఎంసీ చైర్మన్ ప్రవళిక, పీడీలు, పీఈటీలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


