● 53వేల ఎకరాలకు అలీసాగర్ భరోసా
నవీపేట: తీవ్ర వర్షాభావ నేపథ్యంలో సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి సూచించారు. మండలంలోని కోస్లి గో దావరి తీరాన ఉన్న అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా బుధవారం ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు ఎండిపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు బోర్డు ప్రతినిధులను కలిసి సాగునీటి విడుదలకు మెప్పించామన్నారు. 10 రోజులకు ఒక తడి చొప్పున రెండు తడులలో నీటిని విడుదల చేస్తామ ని పేర్కొన్నారు. ఆరు మండలాల్లోని 53,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అన్ని ఆటంకాలను ఎదుర్కొని సాగు నీటిని విడుదల చే శామన్నారు. మాజీ మంత్రి మండవ, ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ప్రమీల, ఎస్‌ఈ గుణవంత్‌రావ్, ఈఈ రమేశ్ కుమార్, డీఈఈ బల రాం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


