కార్పొరేట్‌కు దీటుగా.. | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా..

Sep 10 2026 1:33 AM | Updated on Sep 10 2026 1:33 AM

తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు

ప్రభుత్వ బడులకు మహర్దశ

ఉమ్మడి జిల్లాలో 7 పాఠశాలలు ఎంపిక

నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

కమ్మర్‌పల్లి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్ర భుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ ప్ర మాణాలతో కూడిన పాఠశాలలుగా తీర్చిదిద్దడ మే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టింది. అత్యాధునిక సౌకర్యాలతో కా ర్పొరే ట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు పలు పాఠశాలలను టీపీఎస్‌లుగా ఎంపిక చేసింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం ఏడు ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లుగా ఏర్పా టు చేసేందుకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు నిధులు మంజూరు చేసింది.

ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు..

పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో విద్యార్థులు విద్యను అభ్యసించేలా ప్రణాళిక రూపొందించింది. వివిధ మౌలిక వసతుల పనులు చేపట్టేందుకు ఒక్కో పాఠశాలకు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పరిపాలన అనుమతికి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిధులతో కొత్త భవనాలు లేదా అదనపు తరగతి గదులు, ఫర్నీచర్‌, డెస్కులు, బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ఆధునిక డిజిటల్‌ తరగతి గదులు, సైన్స్‌ ప్రయోగశాలలు, గ్రంథా లయాలు, విద్యుత్‌, వైరింగ్‌, తాగునీరు, అధునాతన మరుగుదొడ్లు, వంటశాల, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పోషకాలతో కూడిన భోజనం, సాయంత్రం స్నాక్స్‌ వంటి సదుపాయాలు సమకూర్చనున్నారు. విద్యార్థులకు ఉచిత బస్సు ర వాణా, క్రీడా మైదానాలు, క్రీ డాకారులకు కిట్లు, దివ్యాంగ విద్యార్థులకు ర్యాంపులు, ఇత ర అనుకూల సదుపాయాలు కల్పించనున్నారు. పాఠశాల ప్రాంగణం, ప్రహరీ ఆధునికీక రణ పనులు చేపట్టనున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ప్ర త్యామ్నాయంగా ఇంగ్లిష్‌ మీడియంలో నాణ్యమైన ఆధునిక సాంకేతిక పద్ధతులతో బోధన అందించనున్నారు. సమగ్ర అభివృద్ధి కోసం క్రీడలు, కళలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలు, క్రీడలను ప్రోత్సహించే క్యాంపస్‌లుగా టీపీఎస్‌లను తీర్చిదిద్దనున్నారు.

కామారెడ్డి జిల్లా

కామారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్‌(బాయ్స్‌), కామారెడ్డి 10.10 కోట్లు

బాన్సువాడ జీహెచ్‌ఎస్‌, బాన్సువాడ 8.90 కోట్లు

ఎల్లారెడ్డి జీహెచ్‌ఎస్‌, ఎల్లారెడ్డి 9.90 కోట్లు

జుక్కల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, పిట్లం 9.90 కోట్లు

నిజామాబాద్‌ జిల్లా

నియోజకవర్గం పాఠశాల మంజూరైన నిధులు

నిజామాబాద్‌ రూరల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, ధర్పల్లి 8.10 కోట్లు

ఆర్మూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, డొంకేశ్వర్‌ 9.10 కోట్లు

బాల్కొండ జెడ్పీహెచ్‌ఎస్‌, గోన్‌గొప్పుల 9.60 కోట్లు

టీజీపీఎస్‌గా గుర్తింపు పొందిన పాఠశాలలు,

మంజూరైన నిధుల వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement