లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Sep 10 2026 1:33 AM | Updated on Sep 10 2026 1:33 AM

నిజామాబాద్‌ లీగల్‌ : ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని, పెండింగ్‌ లో ఉన్న కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్‌పర్సనన్‌, జిల్లా కోర్టు ప్రధాన న్యా యమూర్తి జీవీఎన్‌ భారతలక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సారి నిర్వహించ నున్న జాతీయ లోక్‌అదాలత్‌లో 200 బ్యాంకు రుణాల రికవరీ కేసులు, 1,900 క్రిమినల్‌ కేసులు, 780 ప్రమాద బీమా కేసులు, ఇ తర సివిల్‌ కేసులు, చెక్‌ బౌన్స్‌ కేసులు కలిపి మొత్తం 4,500కు పైగా కేసులను రాజీమా ర్గం ద్వారా పరిష్కరించేందుకు గుర్తించినట్లు న్యాయమూర్తి వివరించారు. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేని స్థితిలో ఉన్న కక్షిదారులు తమ న్యాయవాది లేదా పోలీసుల ద్వారా లేదా వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా తమ గుర్తింపు (ఐడెంటిఫికేషన్‌) పూర్తి చేసి లోక్‌ అదాలత్‌లో పాల్గొని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నీలిమ ముద్దసాని, సూపరింటెండెంట్‌ శైలజ పాల్గొన్నారు.

వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాలి

నిజామాబాద్‌ రూరల్‌: డీసీఎస్‌ (డిజిటల్‌ క్రాప్‌ సర్వే) వలంటీర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటలను పరిశీలించాలని జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి అన్నారు. మండల వ్యవసాయ అధికారిణి హీరా జాదవ్‌తో కలి సి గుండారం శివారులోని పంటపొలాలను కలిసి పరిశీలించారు. డీసీఎస్‌ వలంటీర్లు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, పంటల వివరాలను డిజిటల్‌ క్రాప్‌ సర్వే యాప్‌ ద్వారా క్షేత్రస్థాయిలో నమోదు చేశారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివ రాలు డిజిటల్‌ క్రాప్‌ సర్వే ద్వారా నమోదైతే ప్రభుత్వ వ్యవసాయ పథకాల అమలు, రైతులకు అందాల్సిన ప్రయోజనాలను సమ ర్థవంతంగా అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని డీఏవో అన్నారు. ఏఈవో కృష్ణరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌ అర్బన్‌: పండుగల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయి చైతన్య అన్నారు. నేరాల నియంత్రణ చర్యలపై కమిషనరేట్‌ కార్యాలయంలో బుధవారం నిజామాబాద్‌ డివిజన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీ పీ మాట్లాడుతూ.. వాహనాల తనిఖీలు ని రంతరం కొనసాగాలని, డ్రగ్స్‌, గంజాయి ని ర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలన్నారు. నిషేధిత మత్తుపదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్‌ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏసీపీ ప్రకాశ్‌యాదవ్‌, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, ఆయా విభాగాల ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement