అర్బన్‌ అభివృద్ధికి నిధులివ్వండి | - | Sakshi
Sakshi News home page

అర్బన్‌ అభివృద్ధికి నిధులివ్వండి

Sep 10 2026 1:33 AM | Updated on Sep 10 2026 1:33 AM

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సహకరించా ల ని ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. నగర అభివృద్ధికి స్పెషల్‌ ఫండ్‌ కింద రూ.200 కోట్లు విడుదల చేయాలని, అలాగే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ కళాశాలను మంజూరు చే యాలని ధన్‌పాల్‌ కోరారు. నగరంలో ట్రాఫిక్‌ సమ స్యను దృష్టిలో పెట్టుకొని ఔటర్‌ రింగ్‌ రోడ్ల నిర్మా ణం చేపట్టాలని, ఈవిషయమై గతంలోనూ అనేకసార్లు ప్రభు త్వం దృష్టికి తీసుకొచ్చానని గర్తుచేశారు. మాస్టర్‌ప్లా న్‌ అమలు, కళాభారతి పెండింగ్‌ బిల్లుల మంజూ రు, రాజారాం స్టేడియం ఆధునికీక ర, డీఎస్‌ఏ మై దానంలో సింథటిక్‌ ట్రాక్‌తో కూడిన స్టేడియం, ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టాలని కోరారు. ఖిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేయాలని, జిల్లా జన రల్‌ ఆస్పత్రిలో మరమ్మతులు, మౌలిక సౌకర్యాలకు నిధులు విడుదల చేయాలని, వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలని, బస్టాండ్‌ ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని విన్నవించారు.

హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయాలి...

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాలు, ప్రాంతాల్లోని ఉద్యోగులకు సవరించిన ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)ను తక్షణమే వర్తింపజేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. శాసనమండలిలో బుధవారం జరిగిన చర్చలో కొమరయ్య.. ప్రజోపయోగ, ఉద్యోగ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ సవరణ, రాష్ట్రంలో నూతన ఇథనాల్‌ పాలసీ రూపకల్పన, అనుమతులు లేని కార్పొరేట్‌ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మున్సిపాలిటీల పరిధి విస్తరించిన నేపథ్యంలో ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ రేట్ల ను సమీక్షించాలని, నిబంధనల ప్రకారం అందాల్సి న ప్రయోజనాలు జాప్యం లేకుండా అందేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement