వేములవాడ: ఖతార్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి చీటి సతీశ్‌రావు తెలిపారు. బాగేజ్ హ్యాండ్లర్లు, క్లీనర్లు, వెయిట్రెస్‌లు, సౌస్‌చెఫ్‌లు, కుక్‌లు, క్యాటరింగ్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివ రించారు. బాగేజ్ హ్యాండ్లర్, క్లీనర్ పోస్టులకు ఖతార్ కరెన్సీ రూ.వెయ్యి రియాల్స్ బేసిక్ వేతనం ఉండగా, సౌస్ చెఫ్‌కు రూ.5వేల రియాల్స్, సీనియర్ సీడీపీకి రూ.4వేల రియాల్స్, చీఫ్ స్టీవర్డ్‌కు రూ.3,500 రియాల్స్ వరకు వేతనం ఉంటుందని వివరించారు. ఇతర పోస్టులకు పోస్టును బట్టి రూ.1,600 నుంచి రూ.3,200 రియాల్స్ వరకు గ్రాస్ వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు వీసా, టికెట్, వైద్య సదుపాయాలను సంస్థ కల్పిస్తుందని వెల్లడించారు. వివరాలకు సికింద్రాబాద్ 83320 52299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999, జగిత్యాల 83320 42299, సిరిసిల్ల 93476 61522, ఆఫీస్ 040–42029999 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఇంటర్వ్యూ తేదీ వేదిక
సెప్టెంబర్ 17 సికింద్రాబాద్ – జీటీఎం ఇంటర్నేషనల్ కార్యాలయం
18 సిరిసిల్ల, జగిత్యాల– క్లీనర్ (బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు)
19 నిజామాబాద్, ఆర్మూర్ (క్లీనర్, బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు)


