● అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
● ఎయిమ్స్ దవాఖాన
సుభాష్‌నగర్: కేంద్ర ప్రభుత్వం బీబీనగర్‌లో నిర్మించిన ఎయిమ్స్‌లో అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రయివేటు ఆస్పత్రులకు ధీటుగా వైద్యసేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. 750 బెడ్‌లతో నిర్మించిన ఎయిమ్స్‌లో ప్రస్తుతం 260 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రధానంగా రూ.10 ఫీజుతో ఏడాదిపాటు ఓపీ పొందవచ్చన్నారు. అలాగే ఇన్ పేషెంట్‌గా అడ్మిట్ అయితే ఒక రోజుకు బెడ్‌ఛార్జీ కేవలం రూ.35 తీసుకుంటారన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం 25 ప్రధాన విభాగాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర వైద్యం కావాల్సిన వారు ఎయిమ్స్‌లో చికిత్స పొందాలన్నారు. అవసరమైన వారు తమను సంప్రదిస్తే రిఫర్ చేస్తామని తెలిపారు.


