సమస్యల పరిష్కారంలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంలో జాప్యం

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

ఉద్యోగుల డిమాండ్‌లను నెరవేర్చాలి

సెప్టెంబర్‌ 10న చలో హైదరాబాద్‌

టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌

మారం జగదీశ్వర్‌

ఆర్మూర్‌టౌన్‌ : సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, జనరల్‌ సెక్రెటరీ ఏలూరి శ్రీనివాస్‌ అ న్నారు. చలో హైదరాబాద్‌ మహాధర్నాను ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్మూర్‌ పట్టణంలోని టీఎన్జీవోస్‌ యూనిట్‌ కార్యాలయంలో మంగళవారం సన్నాహక సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌ మాట్లాడు తూ.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లను నెరవే ర్చాలని కోరుతూ చేపట్టనున్న మహాధర్నాను విజ యవంతం చేయాలన్నారు. 2023 జూలై నుంచి 51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో పీఆర్‌సీ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు వెంటనే విడు దల చేయాలని, రూ.10 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఆ రోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు ఉద్యోగ సంఘాల గుర్తింపును పునరుద్ధరించాలన్నారు.

సమావేశంలో టీజీఈ జేఏసీ రాష్ట్ర నాయకుడు దామోదర్‌రెడ్డి, టీన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్‌, కార్యదర్శి శేఖర్‌, ఆర్మూర్‌ యూనిట్‌ అధ్యక్షుడు శశికాంత్‌రెడ్డి, కార్యదర్శి విశాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement