ఫిజియోథెరపీకి ఎంతో ప్రాధాన్యత ఉంది | - | Sakshi
Sakshi News home page

ఫిజియోథెరపీకి ఎంతో ప్రాధాన్యత ఉంది

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

సీపీ సాయిచైతన్య

సుభాష్‌నగర్‌: ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఫిజియోథెరపీకి ఎంతో ప్రాధాన్యత ఉందని సీపీ సాయిచైతన్య అన్నారు. మంగళవారం వరల్డ్‌ ఫిజియోథెరపీ డే వేడుకలను రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్‌ జిల్లా ఫిజియోథెరపీ అసోసియేషన్‌ సభ్యు లు నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ ముఖ్య అతి థిగా హజరై మాట్లాడారు. ప్రమాదాలు, గాయాలు, శస్త్రచికిత్సలు, కీళ్ల, కండరాల సమస్యలు, నడకకు సంబంధించిన ఇబ్బందులు తదితర సమస్యల నుంచి కోలుకోవడంలో ఫిజియోథెరపీ చికిత్స ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో తగినంత శారీరక వ్యాయామం, నడక, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో వైద్యులు, ఫిజియో థెరపీస్టులు, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు ప్రశంస పత్రాలు ఇచ్చి అభినందించారు. కార్యక్రమంలో మేయర్‌ ఉమారాణి, ఫిజియోథెరపీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శివకుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అశ్విని జోషి, జనరల్‌ సెక్రెటరీ ప్రమోద్‌ కుమార్‌, ట్రెజరర్‌ కీర్తి గుప్తా, ఫిజియోథెరపీస్టులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement