● పదిమందికి గాయాలు
ఆమనగల్లు: టెంపో ట్రావెలర్‌ను మిల్క్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నుంచి శ్రీౖ శెలం దేవస్థానానికి సోమవారం టెంపో ట్రావెలర్‌లో 17 మంది వెళ్తున్నారు. అర్ధరాత్రి రంగారెడ్డి జి ల్లా ఆమనగల్లులోని రాజీవ్‌చౌరస్తా వద్ద మాడ్గుల నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మిల్క్ ట్యాంకర్ వే గంగా వచ్చి ఢీకొన్నది. ఈ ఘటనలో టెంపో ట్రావెలర్‌లో ఉన్న నిజామాబాద్‌కు చెందిన కై లాస్, క న్నా, నాగరాజు, ధన్‌రాజ్, గోపాల్, శ్రీరామ్, భూ మి తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్‌కు చెందిన సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


