సర్పంచ్‌ లాల్‌సింగ్‌కు డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ లాల్‌సింగ్‌కు డాక్టరేట్‌

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

నిజామాబాద్‌ రూరల్‌: చందూర్‌ మండలం కారేగాం తండా సర్పంచ్‌ డాక్టర్‌ రమావత్‌ లాల్‌సింగ్‌ డాక్టరేట్‌ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో ‘సమకాలీన హిందీ ఉపన్యాస్‌ మే సంప్రదాయిక్‌ సంఘర్స్‌’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసిన ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ను అందజేశారు. విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా, భారతీయ బయోటెక్నాలజీ చైర్మన్‌ కృష్ణ మిలా విసి మొగలయ్య చేతుల మీదుగా లాల్‌సింగ్‌ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఒకవైపు సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూనే, మరోవైపు ఉన్నత విద్యను కొనసాగించి పీహెచ్‌డీ సాధించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement