మాక్లూర్: మండలంలోని మాణిక్‌బండార్‌చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం స్కూటీని ఎదురుగా వస్తున్న ఓ స్కూల్ బస్సు ఢీకొన్నది. ప్రమాదంలో స్కూటీపై ఉన్న మహిళకు గాయాలయ్యాయి. హె ల్మెట్ ఉండడంతో ఆమెకు ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ముబారక్‌నగర్‌కు చెందిన కవిత డిచ్‌పల్లి మండలంలోని ఓ జీపీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఉదయం రోజు మాదిరిగానే స్కూటీపై డిచ్‌పల్లికి వెళ్తుండగా మాణిక్‌బండార్ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న ఓ స్కూల్ బస్ ఢీకొన్నది. బస్సు ముందు చక్రం కింద స్కూటీ పడింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. హెల్మె ట్ ఉండడంతో ఆమె ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.


