వేడుకలకు గణనాథులు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

వేడుకలకు గణనాథులు సిద్ధం

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

విభిన్న రూపాల్లో లభ్యం

సందడిగా మారుతున్న విక్రయ కేంద్రాలు

నిజామాబాద్‌ రూరల్‌: వినాయక చవితి పండుగ సమీపిస్తుండడంతో వేడుకలకు గణనాథులు సిద్ధమవుతున్నా యి. ఈ నెల 14న సోమవారం వినాయక చవితి ప ర్వదినాన్ని పురస్కరించుకొని వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద విగ్రహాల అమ్మకాలకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాల కమిటీ వారు వచ్చి చాలా వరకు విగ్రహాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డు, పెద్ద బజార్‌, ఫులాంగ్‌, బోర్గాం బ్రిడ్జి ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా కళాకారులు వివిధ ఆకృతులు, రంగులు, అలంకరణలతో గణనాథులను తయారు చేసి విక్రయాని కి సిద్ధం చేశారు. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్ర హాల వరకు.. సంప్రదాయ గణపతి రూపాలతో పాటు బాల గణపతి, రాజ గణపతి, లంబోదరు డు, నత్య గణపతి వంటి భిన్న రూపాలు మార్కెట్‌లో లభ్యం కానున్నాయి. విగ్రహాల కొనుగోళ్లతో విక్రయ కేంద్రాలు సందడిగా మారుతున్నాయి.

గణేశ్‌ చతుర్థి సందర్భంగా లక్షల సంఖ్యలో విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కొన్ని గల్లీలోనే విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేవారు. ఏడాదికేడాది గల్లీకి మూడు నుంచి నాలుగు విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా వేడుకలు నిర్వహిస్తునఆనరు. ఇందుకు యువత ముందుకు రావడంతో గణేశ్‌ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌ బైపాస్‌, వినాయక్‌నగర్‌, పెద్దబజార్‌, బోర్గాం(బి) బ్రిడ్జి ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో విగ్రహాలు అందుబాటు లో ధరల్లో ఉన్నాయి. రెండు అడుగుల గణపతి ప్ర తిమ గతంలో రూ.2,500 ఉండగా, ప్రస్తుతం రూ.1800, 5 నుంచి ఆరు అడుగుల ప్రతిమలు గ తంలో రూ.35 వేల నుంచి రూ.45 వరకు ఉండగా ప్రస్తుతం రూ.25 వేల వరకు ఉన్నాయి.

మట్టిగణపతులకు ప్రాధాన్యత ఇవ్వాలి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ఉపయోగించాలని విద్యావేత్తలు, పర్యావరణ పరిరక్షకులు పేర్కొంటున్నారు. ప్లాస్టరఫ్‌ ప్యారీస్‌ తయారు చేసిన రంగుల గణపతులు చెరువులో నిమజ్జనం చేస్తే చెరువులో ఉన్న వివిధ రకాల చేపలు, మిగిత చలరాశులకు హాని కలుగుతుంది. దీంతో మట్టి గణపతులకు ప్రాధాన్యతను ఇవ్వాలని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. మట్టి గణపతుల ధర రంగుల గణపతుల ధరలకు తీవ్ర వ్యత్యాసం ఉంటుంది. 5, 6 అడుగుల మట్టి గణపతి రూ.10వేలలోపు అందుబాటులో ఉన్నాయి.

పూలాంగ్‌ వద్ద వివిధ ఆకృతుల్లో

ఆకట్టుకుంటున్న గణనాథులు

పది రోజుల ముందు నుంచే..

ప్రతి ఏడాది కంటే ఈ సారి పది రోజుల ముందు నుంచే విగ్రహాల విక్రయాలు మొద లయ్యాయి. మండపాల ని ర్వాహకులు సైతం ముందు గానే విగ్రహాలను తీసుకెళ్తున్నారు. ధరలు నామమాత్రంగా ఉండడంతో గిరాకీ బాగానే ఉంది.

– కే శివ, గణపతి విగ్రహాల విక్రయదారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement