● కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
తెయూ(డిచ్‌పల్లి): నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనలను ఉల్లంఘిస్తున్న బీఈడీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐపీఎస్‌యూ, డీఎస్‌వో విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు విఘ్నేశ్, రఘురాం, అనిల్, గోపిచంద్, గోపాల్ సింగ్ ఠాగూర్, చందు, వినీత్, సూర్యపాల్, ఆజాద్, సునీల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
● డాక్టరేట్ అందుకున్న సువర్చల
తెయూ(డిచ్‌పల్లి): తెయూ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సారంగపూర్)లో అసిస్టెంట్ ప్రొఫెసర్(కాంట్రాక్టు) గా విధులు నిర్వహిస్తున్న యెండల సువర్చల ప్రదీప్ ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. సోమవారం ఓయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో వీసీ కుమార్ మొలుగురాం, సువర్చలకు డాక్టరేట్ పట్టా అందజేశారు. అనంతరం సువర్చల మాట్లాడుతూ.. తన కుటుంబం అందించిన సహకారంతో పీహెచ్‌డీ పూర్తి చేసి పట్టా అందుకున్నట్లు తెలిపారు. ఆమెను తెయూ ఎడ్యుకేషన్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.
● సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర
తెయూ(డిచ్‌పల్లి): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం క్యాంపస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. వర్సిటీ ప్రధాన గేటు వరకు శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ తెయూ అధ్యక్ష, కార్యదర్శులు సమీర్, మోహన్, ఏబీవీపీ ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివ, వైస్ ప్రెసిడెంట్ విజయ్, లెనిన్, అనిల్ జాయింట్ సెక్రెటరీ విఘ్నేశ్, కిరిటి, రాజేందర్, కార్యకర్తలు పవన్, రామకృష్ణ, అశ్విత్, టిల్లు, కిరణ్, ప్రీతం, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
● కొనసాగుతున్న ఎంఈడీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు ఒక విద్యార్థికి గాను ఒక విద్యార్థి హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.


