వివాదాస్పద స్థలం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

వివాదాస్పద స్థలం పరిశీలన

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

సిరికొండ: మండలంలోని కొండాపూర్‌ గ్రామంలో గ్రామస్తులకు, బంజారాలకు మధ్య నెలకొన్న వివాదాస్పద స్థలాన్ని నిజామాబాద్‌ ఏసీపీ ప్రకాశ్‌ మంగళవారం పరిశీలించారు. వివాదాస్పద స్థలం గురించి సోమవారం జరిగిన ఘటనపై స్థానిక పోలీస్‌ అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, చేపట్టిన చర్యలు తదితర అంశాలపై ఏసీపీ వివరాలు సేకరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు. ఏసీపీ వెంట ధర్పల్లి సీఐ భిక్షపతి, స్థానిక ఎస్సై రామకృష్ణ ఉన్నారు.

ఇంటెలిజెన్స్‌ సీఐ బదిలీ

నిజామాబాద్‌ అర్బన్‌: ఇంటెలిజెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఎండీ సాజిదుల్లా మంగళవారం బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన సాజిదుల్లా నాలుగేళ్లుగా డిప్యుటేషన్‌పై జిల్లాలో ఇంటెలిజెన్స్‌ సీఐగా పనిచేస్తున్నారు. కాగా అతనిని బదిలీ చేస్తూ హైదరాబాద్‌ జోన్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

విద్యాశాఖ

సూపరింటెండెంట్‌..

ఖలీల్‌వాడి: జిల్లా విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మురళీ మనోహర్‌కృష్ణను బదిలీ చేస్తూ ఆర్జేడీ మదన్‌ మోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు అధికారి డిసెంబర్‌లో పదవీవిరమణ చేయా ల్సి ఉంది. సోమవారం బదిలీ ఆర్డర్‌ రావడంతో సూపరింటెండెంట్‌ మురళి మనోహర్‌ కృష్ణ డైట్‌లో జాయిన్‌ కావడానికి నాట్‌ విలింగ్‌ ఇస్తూ ఆర్జేడీకి మంగళవారం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

బంద్‌ విజయవంతం

బోధన్‌: విద్యార్థుల పెండింగ్‌ బోధనా రుసుం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల యా జమాన్య ఐక్యవేదిక మంగళవారం కళాశాలల బంద్‌కు పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా పట్టణ కేంద్రంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలల, ఉషోదయ మహిళ డిగ్రీ కళాశాలలను యాజమాన్యం బంద్‌ పాటించాయి. ఉషోదయ విద్యా సంస్థల చైర్మన్‌ సూర్యప్రకాశ్‌ మా ట్లాడుతూ.. 2021 నుంచి విద్యార్థులకు రావాల్సిన బోధనా రుసుం అందకపోవడం వల్ల వి ద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురవుతు న్న ఇబ్బందులను వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు బంద్‌లో పాల్గొన్నారు.

నియామకం

లింగంపేట: జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మాకం రాములుకు నియామాక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు శంకర్‌ అందజేశారు. జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య ఆదేశాల మేరకు రిటైర్డ్‌ ఎస్‌టీవోగా, మాజీ పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌గా పనిచేసిన మాకం రాములు సేవలను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షునిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం బలోపేతాపేతానికి కృషి చేయాలని సూచించారు. కా ర్యక్రమంలో అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్‌, జిల్లా మహిళా అధ్య క్షురాలు సునిత, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement