భూ రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

భూ రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి

Sep 9 2026 3:16 AM | Updated on Sep 9 2026 3:16 AM

● ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా

నందిపేట్‌: భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా అధికారులను ఆదేశించారు. మండలంలోని మల్లా రం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను మంగళవారం సబ్‌ కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మండల తహ సీల్‌ కార్యాలయంలో ఇప్పటి వరకు చేపట్టిన సర్వే వివరాలను తెలుసుకున్నారు. సర్వే సమయంలో భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, గ్రామ సరిహద్దులు, గ్రామ కంఠం తదితర వివరాలను పరిశీలించి సంబంధిత రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను, కుద్వాన్‌పూర్‌లో మహాత్మా జ్యోతీబా ఫూలే గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించారు. మండల కేంద్రంలోని పలుగుట్ట ప్రాంతంలో మినీస్టేడియం కోసం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ లక్ష్మణ్‌, రెవెన్యూ సిబ్బంది, లాండ్‌ సర్వే అధికారులు, స్థానిక నాయకులు బైండ్ల ప్రశాంత్‌, మంగ్లారపు ధర్మన్న ఉన్నారు.

కోమట్‌పల్లిలో..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): పైలెట్‌ ప్రాజెక్టు కింద చేపడుతున్న భూముల రీ సర్వేను త్వరగా పూర్తి చేయా లని ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా సర్వేయర్లకు సూచించారు. డొంకేశ్వర్‌ మండలం కోమట్‌పల్లిలో కొనసాగుతున్న సర్వేను ఆయన పర్యవేక్షించారు. రైతులు స్థానికంగా ఉండి భూముల సర్వేను పూర్తి చేయించుకోవాలన్నారు. సర్వే పూర్తయితే భూవివాదాలు, హ ద్దుల సమస్యలు ఉండవని పేర్కొన్నారు. ఎక్కువ సర్వే నంబర్లు ఉన్నందునా అక్టోబర్‌ రెండో వారానికల్లా సర్వేను పూర్తి చేస్తామని సర్వేయర్‌ కిషన్‌నాయక్‌ సబ్‌ కలెక్టర్‌కు వివరించారు. తహసీల్దార్‌ ప్రసాద్‌, ఆర్‌ఐ నితీశ్‌రెడ్డి, సర్పంచ్‌ సుమలత ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement