పోలీస్‌ ప్రజావాణిలో 37 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ప్రజావాణిలో 37 ఫిర్యాదులు

Sep 8 2026 2:05 AM | Updated on Sep 8 2026 2:05 AM

పోలీస్‌ ప్రజావాణిలో 37 ఫిర్యాదులు సైక్లింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ బంగారంపై ఎక్కువ లోన్‌ ఇస్తామంటూ మోసం!

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాకేంద్రంలోని సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్‌ ప్రజావాణిలో 37 ఫిర్యాదులను స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను విన్నవించుకున్నారన్నారు. తక్షణమే చట్టపరంగా సమస్యలను పరిష్కరించాలని పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్‌అర్బన్‌: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఈనెల 5, 6 తేదీలలో తెలంగాణ సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి మౌటైన్‌ బైక్‌ సైక్లింగ్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చినట్లు జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి విజయ్‌కాంత్‌ రావ్‌ అన్నారు. జిల్లాకు చెందిన శిల్పచౌహాన్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు, వెండి పతకాలు సాధించారన్నారు. ఈసందర్భంగా వారికి జిల్లా సైక్లింగ్‌ సంఘం ప్రతినిధులు కృపాకర్‌ రెడ్డి, విజయ్‌ కాంత్‌ రావ్‌, సురేందర్‌, సూర్య ప్రకాష్‌ అభినందనలు తెలిపారు.

మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా సురేశ్‌

నిజామాబాద్‌ అర్బన్‌: మాదిగ ఉద్యోగుల సమైక్య జాతీయ ఉపాధ్యక్షుడిగా సిలుమల సురేశ్‌ నియమితులయ్యారు. ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చే శారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మాదిగ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తానని సురేశ్‌ అన్నారు.

జాతీయ కోర్‌ కమిటీ సభ్యులుగా గంగారాం

మాదిగ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జాతీయ కోర్‌ కమిటీ సభ్యులుగా జిల్లాకు చెందిన తెడ్డు గంగారాం నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నియామకపత్రం అందజేశారు.

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఆటోనగర్‌కు చెందిన ఓ మహిళకు బంగారంపై లోను ఇస్తానని చెప్పి బురిడికొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని ఆటోనగర్‌కు చెందిన మహిళ రెండున్నర తులాల బంగారంపై ప్రైవేట్‌ బ్యాంకులో లోన్‌ తీసుకుంది. సోషల్‌మీడియాలో బంగారంపై ఎక్కువ రుణాలు ఇస్తామంటూ వచ్చి ప్రకటనకు ఆమె స్పందించి, వారిని సంప్రదించింది. దీంతో ప్రకటన చేసిన వ్యక్తులు ఆమె బ్యాంకులో పెట్టిన బంగారంను విడిపించి సగం డబ్బులు చెల్లించి మిగిత డబ్బులు ఆదివారం ఇస్తామని చెప్పారు. సదరు మహిళ ఆ వ్యక్తులను సంప్రదించగా ఆ బంగారం 22 క్యారెట్‌లు కాదని 18 క్యారెట్‌లు అని మిగిత డబ్బులు మాకే తిరిగి చెల్లించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నగరంలోని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement