తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తప్పిన పెను ప్రమాదం

Sep 7 2026 7:51 AM | Updated on Sep 7 2026 7:51 AM

విద్యుత్‌ తీగలకు తగిలిన

భారీ వినాయక ప్రతిమ

విరిగిన విద్యుత్‌ స్తంభం..

రోడ్డుపై పడిన విద్యుత్‌ తీగలు

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కోటార్మూర్‌ సమీపంలో 63వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కోరుట్ల నుంచి కామారెడ్డికి భారీ వినాయక ప్రతిమను యువకులు ట్రాక్టర్‌ సహాయంతో తీసుకెళ్తుండగా.. కోటార్మూర్‌ సమీపంలో 11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలాయి. ప్రతిమ దెబ్బతినగా.. అదే సమయంలో 11 కేవీ విద్యుత్‌ వైర్లు సైతం తెగి వాహనాలపై పడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్‌ సరఫరా ఉండిఉంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్‌ తీగలను తొలగించారు. వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement