● పురావస్తుశాఖ రాష్ట్ర డైరెక్టర్ అర్జున్‌రావు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : కాకతీయుల కాలంనాటి మహిమాన్విత క్షేత్రమైన త్రిలింగేశ్వరాలయాన్ని అభివృద్ధి చేస్తామని పురావస్తుశాఖ రాష్ట్ర డైరెక్టర్ అర్జున్‌రావు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ సమీపంలో ఉన్న త్రిలింగేశ్వరాలయాన్ని ఆదివారం ఆయన తన బృందంతో సందర్శించారు. ఆలయ పరిసరాలను పరిశీలించడంతో పాటు ఆలయ చరిత్రను స్థానికుల ద్వారా తెలుసు కున్నారు. అనంతరం అర్జున్‌రావు మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతోపాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సూచనల మేర కు తాము త్రిలింగేశ్వరాలయాన్ని సందర్శించామన్నారు. ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టేందు కు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. పు రావస్తు శాఖ డీడీ నాగరాజు, ఏడీ మల్లునాయక్, ఆలయ కమిటీ చైర్మన్ కొమ్మ దత్తు, సర్పంచుల ఫో రం మండలాధ్యక్షుడు మురళీమోహన్‌గౌడ్, సర్పంచ్‌లు యాదాగౌడ్, వెంకాగౌడ్ తదితరులు ఉన్నారు.


