● ‘చలో ఇందిరాపార్క్’ ర్యాలీని
జెండా ఊపి ప్రారంభించిన
ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
సుభాష్‌నగర్: రాష్ట్రంలోని రైతులు, అమాయకుల భూములను రాష్ట్ర ప్రభుత్వం 22(ఏ) నిషేధిత జా బితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేయడం సిగ్గు చేటని, కాంగ్రెస్ మెడలు వంచే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో ని ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షకు జిల్లా నుంచి భారీగా తరలివెళ్లారు. ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద దీక్షకు తరలివెళ్లే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమాయక ప్రజల భూములతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారన్నా రు. ప్రభుత్వ భూములను కాపాడాలని 22 ఏ చ ట్టం చెబితే... ప్రభుత్వం మాత్రం రైతుల భూము లను నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి, నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, వె ల్మ గంగారెడ్డి, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


