యువతను ప్రభుత్వం మోసం చేసింది | - | Sakshi
Sakshi News home page

యువతను ప్రభుత్వం మోసం చేసింది

Sep 6 2026 2:01 AM | Updated on Sep 6 2026 2:01 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించా రు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం భీమ్‌గల్‌ పట్టణంలో విద్యార్థులు, యువతీయవకులతో కలి సి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ‘విద్యార్థి, నిరుద్యోగ సదస్సు‘లో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మొత్తం 2,32,328 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతులు రాగా, 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. అందులో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్‌ ప్రభుత్వం విజయవంతంగా భర్తీ చేసిందని, మరో 42,652 పోస్టులకు రాత పరీక్షల వరకు ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. అధికారంలోకి రాగానే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీ 8వ సెషన్‌లో ఎమ్మెల్యే కేటీఆర్‌ అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బదులిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 31,798 పోస్టులకు 16 నోటిఫికేషన్లు ఇచ్చి అందులో భర్తీ చేసింది 16,978 ఉద్యోగాలు అని అసెంబ్లీ సాక్షిగా భట్టి సమాధానం ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల వీడియోలను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కళాశాలలకు వెళ్లే ప్రతి యువతికి ఉచిత ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇస్తామని ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్‌ రెడ్డి స్వయంగా ప్రకటించి, నేడు ఒక్క విద్యార్థినికి కూడా ఇవ్వకుండా విస్మరించారన్నారు. ఉన్నత విద్యాభ్యాసం, ల్యాప్‌టాప్‌లు, ఐపా డ్‌లు, రూ.5 లక్షల బ్యాంక్‌ గ్యారెంటీ విద్యా భరోసాకార్డు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూళ్లను అటకెక్కించారని, యూత్‌ డిక్లరేషన్‌లో ప్రకటించిన ఎస్సెస్సీ పాసైన వారికి రూ.10 వేలు, ఇంటర్‌కు రూ.25 వేలు, డిగ్రీకి రూ.50 వేలు, పీజీకి రూ.లక్ష, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయం హామీలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డా రు. నిరుద్యోగ భతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్కో నిరుద్యోగికి రూ.1.32 లక్షలు బాకీ పడిందన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన జాబ్‌లకు, నిర్మించిన ఫ్లైవర్లకు రిబ్బన్‌లు కత్తిరిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి రిబ్బన్‌రెడ్డి మారారని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సదస్సుకు హాజరైన విద్యార్థులు, యువత చేతులెత్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే చేసిన డిమాండ్‌లను మద్దతు తెలిపారు.

ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్‌..

నిజామాబాద్‌ అర్బన్‌ : కాంగ్రెస్‌ ఎన్నికల హామీలను విస్మరించిందని నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా విమర్శించారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని నిరసిస్తూ నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మాజీ మేయర్‌ దండు నీతూకిరణ్‌ శేఖర్‌, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నుడా మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, సత్య ప్రకాశ్‌, సుజిత్‌సింగ్‌, నవీద్‌ ఇక్బాల్‌, జగత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు రూ.1.32 లక్షలు

బాకీ పడ్డ రేవంత్‌ సర్కార్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 16,978 మాత్రమే..

కేసీఆర్‌ ఇచ్చిన జాబ్‌లకు,కట్టిన

ఫ్లై ఓవర్లకు రిబ్బన్లు కట్‌ చేస్తున్నారు

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి విమర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement