తెయూ(డిచ్‌పల్లి)/ఖలీల్‌వాడి: రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైన తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ప్రొ ఫెసర్ కె.లావణ్య, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శనివారం హైదరాబాద్‌లో అవార్డు లు అందుకున్నారు. కొడంగల్ జూనియర్ క ళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినో త్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉత్త మ ఉపాధ్యాయులు, అధ్యాపకులను సన్మానించి అవార్డులను అందజేశారు. రాష్ట్ర వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా క్టర్ యోగితా రాణా, కళాశాల కమిషనర్ దే వసేన, అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్స్, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.
సంస్థ అభివృద్ధికి
సమష్టిగా కృషి చేయాలి
● నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ
● టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ సోలమన్
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రీజియ న్ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీజీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సోలమన్ అన్నారు. రీజియన్ పరిధిలోని నిజామాబా ద్ –1,2, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బా న్సువాడ డిపోల మేనేజర్లతో జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో శనివారం ఆ యన సమావేశమయ్యారు. డిపోల పనితీరు ను మరింత మెరుగుపర్చాలన్నారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన స మయపాలనతో కూడిన ప్రజా రవాణా సేవ లు అందించాలని సూచించారు.
రీజియన్ పనితీరుపై చర్చించిన ఈడీ.. ఆదాయాన్ని పెంచడంతోపాటు ఖర్చులను నియంత్రిస్తూ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్క రూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎం కృష్ణమూర్తి, డిప్యూటీ ఆర్‌ఎం తదితరులు పాల్గొన్నారు.
ఐదేళ్లలోపు పిల్లల
మరణాలను నివారించాలి
సుభాష్‌నగర్: జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించాలని, గర్భిణులు, చిన్న పిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై నగరంలోని సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉన్న వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆమె సమీక్షించారు. బాలింతలను క్రమం తప్పకుండా ఇంటి వద్దే వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఎంసీపీ కార్డు ప్రతినెలా అప్‌డేట్ చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలను పరీక్షిస్తున్న సమయంలో తల్లిపాల ప్రాముఖ్యతను తెలుపాలన్నారు. మదర్ ఇన్, మదర్ అవుట్ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాలని, తద్వారా గర్భిణులు, శిశువుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. డొంకేశ్వర్, కిసాన్‌నగర్, పోచంపాడ్, రెంజల్, జక్రాన్‌పల్లి, వినాయక్‌నగర్, గోవింద్‌పేట్, ఇందల్వాయి, వేల్పూర్, మోస్రా, తదితర 11 పీహెచ్‌సీ వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లతోపాటు డీఐవో ఎం అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రవీందర్, విద్య, సికందర్‌నాయక్, సీ్త్ర, పిల్లల వైద్యనిపుణులు, సీడీపీవోలు, తదితరులు పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరి రాజ్ ప్రభుత్వ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులను నియమించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రాంమోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అరబిక్, గణితం, బీసీఏ (కంప్యూటర్ సైన్స్– అప్లికేషన్స్)లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, నెట్, సెట్ లేదా పీహెచ్‌డీతోపాటు బోధనా అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను ఈ నెల 8 లోపు కార్యాలయంలో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.
తెయూ ప్రొఫెసర్ లావణ్య
డైట్ ప్రిన్సిపాల్
శ్రీనివాస్


