● జీజీహెచ్, ఎంసీహెచ్‌లో భద్రత కరువు
● సక్రమంగా పనిచేయని సీసీ కెమెరాలు
నిజామాబాద్ అర్బన్: బాలుడి కిడ్నాప్ ఘటన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితోపాటు మతాశిశు సంరక్షణ కేంద్రంలో భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపింది. జీజీహెచ్ నుంచి గతంలో పిల్లలు కిడ్నాప్ అయిన ఘటనల నుంచి ఆస్పత్రి అధికారులు అప్రమత్తత పాఠాలు నేర్చుకోలేదనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగంతో పాటు సీసీ కెమెరాలను పెంచాలని ఒకటో టౌన్ పోలీసులు ఆసుపత్రి అధికారులకు రెండుసార్లు విన్నవించారు. సీపీ సాయిచైతన్య గత మూడు నెలల కిందట ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి సమీక్ష ని ర్వహించారు. రక్షణ చర్యలపై పలు సలహాలు, సూ చనలు అందించారు.
బాలుడి కుటుంబ సభ్యుల ఆందోళన
కిడ్నాప్‌కు గురైన వేదాన్ష్ బంధువులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వెంటనే బాబును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వేదాన్ష్ తల్లిదండ్రులను సీపీ సాయి చైతన్య శనివారం రాత్రి పరామర్శించారు. బాలుడి ని సురక్షితంగా అప్పగిస్తామని ధైర్యం చెప్పారు.
జీజీహెచ్‌లో 750 పడకలు ఉన్నాయి. అన్ని విభాగాలకు సంబంధించి రోగులు, వారి బంధువులతోపాటు ఓపీ పేషెంట్లు ఇలా 2వేల మందికిపైగానే వస్తూ వెళ్తుంటారు. నవజాత శిశువులు, బాలింతలు, గర్భిణులకు వైద్యం అందించేందు కు ఏర్పాటైన ఎంసీహెచ్‌కు సైతం తాకిడి ఎక్కువగానే ఉంటుంది. పాత భవనంలో సీసీ కెమెరాలు ఉన్నా, కొన్ని చోట్ల, వెనుక ప్రాంతంలో పనిచేయడం లేదు. మాతశిశు సంరక్షణ కేంద్రం పైఅంతస్తుల్లో సీసీ కెమెరాలు ఉన్నా.. ప్రవేశ మార్గంలో లేకపోవడంతో బాలుడిని ఎటువైపు తీసుకెళ్లారనేది అంతుచిక్కడం లేదు.
గత కొన్ని నెలల కిందట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బురఖాలు ధరించి మహిళలు బాలుడిని కిడ్నాప్‌చేసి ఆటోలో పారిపోయారు. పోలీసులు గాలించగా మహారాష్ట్ర ప్రాంతంలో పట్టుబడ్డారు. ఇదే ఆసుపత్రి నుంచి చికిత్స కోసం వచ్చిన ఓ బాధితుడు తన నాలుగేళ్ల బాలుడిని ఆసుపత్రి ఆవరణలో తనతో పాటు పడుకొబెట్టుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు బాలున్ని కిడ్నాప్ చేశారు. ఇదే ఆసుపత్రిలో ప్రసూతి వార్డులో ప్రసవం కోసం వచ్చిన మహిళ కుమార్తెను ఓ మహిళ, మరో వ్యక్తి కిడ్నాప్ చేశారు.


