వర్ని: నియోజకవర్గంలో అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ వ్య వసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్ని, చందూర్, మో స్రా మండలాలకు చెందిన 121 మంది లబ్ధిదారు లకు శనివారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రా లను బాన్సువాడలోని తన నివాసంలో పోచారం అందజేశారు. అలాగే మోస్రా మండలానికి చెందిన ఐదుగురికి, చందూరుకు చెందిన ముగ్గురికి, వర్నికి చెందిన 21 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశా రు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువా డ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో 11 వేల ఇళ్లు మంజూరు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం నేతృత్వంలో వేలాది ఇళ్లను మంజూరు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. వర్ని మార్కెట్ కమిటీ చై ర్మన్ సురేశ్‌బాబా, వైస్ చైర్మన్ లక్ష్మణ్, జిల్లా కాంగ్రె స్ కార్యదర్శి పిట్ల శ్రీరాములు, సాయాగౌడ్, జాకో రా సర్పంచ్ సాయిలు, చందూర్ సొసైటీ చైర్మన్ అ శోక్, నాయకులు గిరి, బాలు, గంగాధర్, సాయారెడ్డి, సాయాగౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు.


