నిజామాబాద్ అర్బన్: నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. బోధన్‌లోని రాకాసీపేట్ ప్రాంతంలో ఉన్న సహరా మీ సేవ కేంద్రంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, బోధన్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో మీ సేవ ఆప రేటర్ షేక్ వసీమ్ గత రెండేళ్ల నుంచి యజమాని మహమ్మద్ ముక్రమ్, ఇతరులతో కలిసి ఇంటి వద్ద నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింనద్నారు. నిందితులైన షేక్ వసీమ్, మహమ్మద్ ము క్రమ్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామన్నా రు. ఐదు నకిలీ మీసేవ సర్టిఫికెట్‌లతోపాటు అప్పటికే విక్రయించిన 22 జనన ధ్రువీకరణ పత్రాలు, 38 మీ సేవ ఖాళీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక రబ్బర్ స్టాంప్, 13 బోనాఫైడ్‌లు, షాదీ ముబారక్‌కు సంబంధించి తయారు చేసిన నకిలీ జిరాక్స్ కాపీలు, నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన ల్యాప్ టాప్, కలర్ ప్రింటర్, నిందితుల సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మి గతా వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ అజయ్, ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


